TDP vs YSRCP: శాసన మండలిలో గందరగోళం.. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మంత్రి ఫైర్..
- ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం..
- మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై అభ్యంతరం..
- ప్లకార్డులు పట్టుకుని వైసీపీ సభ్యులు సభలోకి రావడాన్ని తప్పుబట్టిన టీడీపీ..
- వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్..
- వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మంత్రి పయ్యావుల ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసన మండలి సమావేశాలు మరోసారి తీవ్ర గందరగోళం చెలరేగుతుంది. నల్ల కండువాలు, దేవుడి పటాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి వైసీపీ సభ్యులు రావడంతో.. అసెంబ్లీ గేటు దగ్గర వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో.. జెండాలు, ప్లకార్డులను వదిలేసి లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా గోవిందా.. గోవిందా అనే నినాదాలు చేసుకుంటు అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లారు. అయితే, ప్రారంభమైన కాసేపటికే శాసన మండలి వాయిదా పడింది.
Read Also: Woman Assaulted: పెళ్లి గురించి చర్చ.. యువతిపై లివ్-ఇన్ పార్ట్నర్ దాడి
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేయాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చెర్మన్ పోడియం దగ్గరకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు.
Read Also: Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి
దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల తీరుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మండిపడ్డారు. దేవుడంటే భయం, గౌరవం లేదని విమర్శించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో మంత్రి పయ్యావుల కేశవ్ హెడ్ ఫోన్స్ ని నేలపై విసిరి కొట్టాడు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!