సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రైతుల పంట నష్టంపై నిలదీశారు. రాష్ట్రంలో పలు సమస్యలపై ఇటీవల వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు స్పందిస్తున్నారు. గతంలో నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్లు, రైతుల ఆత్మహత్యలు, వరి కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసింది. తాజాగా ఇటీవల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. Read Also: రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్,…
తెలంగాణ రైతులు మరణిస్తున్న కేసీఆర్‌కు సోయి లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తున్నా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు. Read Also: తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది : తమ్మినేని వీరభద్రం…
మరోసారి ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అధికార టీఆర్‌ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులు చనిపోతున్న సర్కార్‌కు పట్టడం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముందు ఇంట గెలిచి రచ్చగెలవండంటూ షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా. మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి,బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి,దేశ రాజకీయాల మీద చర్చ…
వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్ కాటేస్తున్నాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.…
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.…
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడతారా? అంటూ ఎదురైన ప్రశ్నపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు.. ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఎదురుప్రశ్నించిన కాకరేపారు వైఎస్ షర్మిల.. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు..…
ఈ మధ్యే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్‌కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.. వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటం.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్న ఆయన.. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదన్నారు.. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు.. మహిళలకు ప్రాధాన్యత షర్మిల…
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో పార్టీ పెడుతున్నారా? అంటూ మీడియా చిట్‌చాట్‌లో ఎదురైన ప్రశ్నకు స్పందించిన ఆమె.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు.. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం.. పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తాం అన్నారు.. ఇక, ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు వైఎస్ షర్మిల.. రైతు…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని అణిచివేయాలని.. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా …కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు…ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు… ఓ రోజు ధరణి…
ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిళ మద్దతు తెలిపారు. జీఓ317 రద్దు చేయాలని, జీఓ 317అంతా తప్పుల తడకగా ఉందని షర్మిళ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ జీఓ స్థానికులనే స్థానికేతరులను చేసిందన్నారు. Read Also:విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారని చెప్పారు.…