తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని…
అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్టుండి సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ…
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈసీ వెల్లడించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని…
కేసీఆర్ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25…
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇప్పటికే ప్రతీ మంగళవారం.. ఒక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల ఇంటి దగ్గర దీక్షలు చేస్తూ వచ్చిన ఆమె.. ఇవాళ టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ధర్నా చేపట్టారు.. Read Also: Ashwani Kumar Quits Congress: కాంగ్రెస్‌కు మరో…
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు.. ఇక, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదని దుయ్యబట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే…
వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. కొత్త జిల్లాలపై ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు ఏపీ సీఎం జగన్‌కు అన్వయిస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ గురించి తనను అడగొద్దంటూ తెలంగాణలోని కొత్త జిల్లాల గురించి మాట్లాడారు. ఇక్కడ 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఏం సాధించారని షర్మిల ప్రశ్నించారు. కనీసం 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా డిప్లాయ్…
సీఎం కేసీఆర్ పై షర్మిల మరోసారి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు,…
తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు వైఎస్ షర్మిల వెల్లడించారు. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇంఛార్జులను నియమించగా.. ఇప్పుడు ఆ కమిటీలన్నీ రద్దు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. Read…