సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలు సీఎం మాకొద్దు అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ”ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతను మోసం చేసినవ్ కదా కేసీఆర్.రాష్ట్రంలో 39% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగం నింపింది లేదు. నోటిఫికేషన్లు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే మీలో చలనం లేదు. మిమ్మల్ని కుర్చీ దించితే గానీ మా బిడ్డలు ఉద్యోగాలు ఎక్కరు. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దు.”…
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి…
మెదక్ జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్‌లో ఇటీవల సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు.. రైతు గుండె ఆగిపోయేలా చేస్తున్నారు కేసీఆర్ అంటూ విమర్శించారు. అంతేకాకుండా వడ్లు వేయాల్సిన…
వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హవేలీ ఘనపూర్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి షర్మిల వెళ్లనున్నారు. రైతు కరణం రవి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. వరి సాగు వేయవద్దన్న ప్రభుత్వ ప్రకటనతో సీఎంకు లేఖ రాసి రైతు కరణం రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు.. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ”రైతులను కోటీశ్వర్లు చేశానని గప్పాలు కొట్టే దొర గారు, ఆ…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతుండంటూ ఎద్దేవా చేశారు. 2 నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదని ఆగ్రహించారు. వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయిందని పేర్కొన్నారు. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారని నిలదీశారు. ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణను… సీఎం కేసీఆర్ చావుల తెలంగాణ చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికుల చావులు కేసీఆర్ పాలన మనకు కనిపించాయని.. ఇప్పుడు సర్పంచ్ ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు షర్మిల. చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యం అని రాష్ట్రంలోని సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచి… ప్రజల నడ్డి విరస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలన చేతకాకపోతే… రాజీనామా చేయండి సారూ అంటూ చురకలు అంటించారు. వైఎస్ పాలనలో మున్సిపల్ పన్ను, కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలు ఏవీ కూడా అణాపైసా పెంచింది లేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పరిపాలనలో విద్యుత్తు, ఆర్టీసీ సంస్థలను నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాలను పూడ్చు కొనేందుకు ఇప్పుడు బస్…
జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండని… సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవని… బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదని… దీంతో జనం పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. పారాసిటమోల్ వేసుకుంటే సరిపోతుందని… ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ సర్కార్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా…
కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ మీ గుండెలు కరుగటం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవా ? అంటూ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే, మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి…