ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్‌పై తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, సోమువీర్రాజు వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… సోషల్ మీడియా వేదికగా లిక్కర్ అమ్మకాలపై స్పందించిన ఆమె.. చీప్ లిక్కర్‌తో బీజేపీ.. ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్…
తెలంగాణ వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.. వైఎస్‌ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ట్వీట్‌లో పేర్కొన్న ఆమె.. బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు.. మొన్న ఆర్టీసీ చార్జీలు…
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. మరణించిన రైతులకు నిన్న తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. పరిహారం విడుదల చేయడం పై కేసీఆర్ పై షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ గారూ.. అందరూ రైతులకు పరిహారం ఇచ్చి.. పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు. చనిపోయిన రైతులు ఎందరు? మీరు ఇచ్చే పరిహారం ఎందరికి? ఇప్పటివరకు దాదాపు 7600 మంది రైతులు చనిపోతే 1600 మందికి పరిహారం ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. పరిహారం…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా… సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో,ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండక,పెట్టుబడి రాక,అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు,ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి అంటూ చురకలు అంటించారు. ఢిల్లీలో…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన 70 రోజుల్లోనే రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…ఇవి ఆత్మహత్యలు కావు, కేసీఆర్ చేసిన హత్యలని నిప్పులు చెరిగారు. కేసీఆర్ రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా దిగజారుస్తున్నాడని…ఆయన కు రైతుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అన్నాక ముందుచూపు ఉండాలని…. ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతులు బతికేవారని… పరిపాలన చేతకాక…
రైతుల పాలిట యముడిలా సీఎం కేసీఆర్ తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో పంట కొనుగోళ్లలో జాప్యం,అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లయ్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని.. బోర్లు వేసుకున్న రైతులకు వైఎస్ ఆర్ ఎంతో చేశారని… పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేసినట్టు? అని నిలదీశారు. రైతు…
టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. రైతుల పాలిట కేసీఆర్…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. మంగళవారం దీక్షలు, పాదయాత్ర, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలతో.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆమె… ఇక, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర వాయిదా పడిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్న ఆమె.. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. అందులో భాగంగా ఇవాళ రైతు…
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల.. మరో పోరాటానికి సంసిద్ధమౌవుతున్నారు. తెలంగాణ రైతుల కోసం… రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు వైయస్ షర్మిల. ఈ రైతు ఆవేదన యాత్రను రేపుటి (ఆదివారం) నుంచి ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. ఈ యాత్రలో భాగంగానే.. రేపు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శించనున్నారు. అలాగే.. మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లికి వెళ్లనున్నారు షర్మిల.…
కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులే కేసీఆర్.. ప్రభుత్వానికి పాడే కడతారంటూ నిప్పులు చెరిగారు షర్మిల. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు, కేసీఆర్ ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని చురకలు అంటించారు. వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదని…కేసీఆర్ రైతు హంతకులని ఫైర్ అయ్యారు. రైతును కాటికి పంపుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది… మీ అధికారానికి…