ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు.. పొత్తుల ప్రస్తావన తెరమీదకి రావడం సాధారణం. తమ పార్టీ బలంగా లేదన్న ఉద్దేశంతోనో, లేక ఒక ప్రత్యర్థిని సెలక్ట్ చేసుకొని అతడ్ని ఓడించాలన్న ప్రణాళికలతోనో పొత్తులు పెట్టుకుంటుంటారు. అందుకే.. ఎన్నికలప్పుడు ప్రతీ పార్టీకి ‘పొత్తు’ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా.. తాను సింగిల్‌గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ సింగిల్‌గానే పోటీ…
వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి, వైఎస్సార్‌టీపీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సర కాలంలో తమ పార్టీ ఎంతో పురోగతి సాధించిందని.. తెలంగాణ ప్రజలకు నిజమైన పక్షంగా నిలబడిందని అన్నారు. తాము చేస్తోన్న దీక్షల వల్లే పాలక పక్షానికి బుద్ధి వచ్చిందన్నారు. పార్టీ పెట్టకముందే నిరాహార దీక్ష చేశానని చెప్పిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానన్నారు. ఇప్పటివరకూ 1500 కిలోమీటర్లు…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది.. ప్రస్తుతం హుజారాబాద్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవాళ బ్రేక్ ఇచ్చిన ఆమె.. పాదయాత్ర స్పాట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు .. ఇక, రేపు ఇడుపులపాయ వెళ్లనున్న ఆమె.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్మోహర్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు..…
హుజూర్ నగర్ లక్కవరంలో వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయకుడు ఏపురి సోమన్నపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. వైఎస్సార్‌టీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ దాడిని ఖండిస్తూ.. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ షర్మిల ఫిర్యాదు పత్రాన్ని అధికార ప్రతినిధి సత్యవతి పోలీసులకు అందించారు. వర్షం పడుతున్నా సరే, దీక్ష విరమించకుండా షర్మిల కొనసాగిస్తున్నారు. దాడికి పాల్పడిన…
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమి లేదని, తాగి ఫామ్ హౌజ్లో పడుకోవడమే తెలుసని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టికి 113వ రోజు చేరింది. ఇందులో భాగంగా ఆమె హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం పరెడ్డి గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. గ్రామస్థులతో వైఎస్ షర్మిల ముచ్చటించిన షర్మిళ ఆమె మాట్లాడుతూ.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న…
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలోని అనంతగిరి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన సుపరిపాలన ప్రతి గడపను.. ప్రతి గుండెను తాకిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన మంచి మనసుతో ఆలోచించి అద్భుతమైన పథకాలు అమలు చేసి చూపించారని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు ఇలా ఎన్నో పథకాలు వైఎస్సార్ ను ప్రజలు…
మీరు ఆశీర్వదించండి… తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం శాంతి నగర్ కు చేరుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ..తెలంగాణాలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమని అన్నారు. వైఎస్సార్ హయాంలో తెలంగాణ సుభిక్షం గా ఉందని పేర్కొన్నారు. కులాలకు…
తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం…
ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని.. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఆయన్ను విమర్శించే స్థాయి లేదని చెప్పారు. తనకు బయ్యారం మైనింగ్‌లో వాటా ఉన్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్ విసిరారు. ఆయన మెడికల్ కాలేజీకి…
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో…