Bill Gates : ఎప్‌స్టీన్ వివాదం.. తప్పు ఒప్పుకున్న బిల్‌గేట్స్.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం’లో.. జెఫ్రీ ఎప్‌స్టీన్ అక్రమ దందాలకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడం, అందులో బిల్‌గేట్స్ పేరు కూడా ఉండటంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఈ వివాదంపై తాజాగా బిల్‌గేట్స్ నోరు విప్పారు. తాను చేసిన పొరపాట్లను అంగీకరిస్తూనే, కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. తన ఫౌండేషన్ సభ్యులకు క్షమాపణలు చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌కు ఉన్న సంబంధమేంటి? ఆ రష్యన్ మహిళల కథేంటి? మెలిందా గేట్స్ హెచ్చరించినా ఆయన ఎందుకు వినలేదు? అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
బిల్‌గేట్స్ తాజాగా ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్కొన్నట్లుగా, తనకు ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధం ఉన్న మాట వాస్తవమేనని బిల్‌గేట్స్ అంగీకరించారు. అయితే, ఆ మహిళలకు ఎప్‌స్టీన్ సాగిస్తున్న అక్రమ దందాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మైనర్లపై అక్రమ వేధింపుల కేసులో ఎప్‌స్టీన్ దోషిగా తేలిన తర్వాత కూడా (2011లో) అతడితో కలవడం తాను చేసిన పెద్ద తప్పని గేట్స్ విచారం వ్యక్తం చేశారు. అతడి నేపథ్యాన్ని సరిగ్గా తెలుసుకోకుండానే చర్చలు జరిపానని, ఆ సమయంలో తన ఫౌండేషన్ సభ్యులను కూడా అతడి దగ్గరకు తీసుకెళ్లడం పెద్ద పొరపాటని ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒప్పుకున్నారు. ఎప్‌స్టీన్‌తో భేటీ అయిన మాట వాస్తవమే అయినా, తాను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడలేదని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ అసిస్టెంట్లు తనతో ఫోటోలు దిగారని, కానీ వారితో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు.
తన మాజీ భార్య మెలిందా గేట్స్, ఎప్‌స్టీన్ విషయంలో మొదటి నుంచీ అనుమానంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, తాను అతడితో పరిచయాన్ని కొనసాగించానని, అది తన తప్పేనని ఆయన అంగీకరించారు. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఎప్‌స్టీన్ కేసులో దాదాపు 30 లక్షల పేజీల దర్యాప్తు పత్రాలను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ జాబితాలో తన పేరు ఉండటంతో బిల్‌గేట్స్ తాజాగా వివరణ ఇచ్చారు.
READ ALSO: PM Modi: ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన మోడీ.. తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డ్!
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!