నేడు గవర్నర్ తమిళిసై ను వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న వైఎస్ షర్మిల. నేడు గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఎల్లుండికి వాయిదా పడింది. రేపు (మంగళవారం) వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. read also: Astrology: ఆగస్ట్…
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారన్నారు.. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయలేదని.. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రావాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించబోరన్నారు.. ఇక, వైఎస్ షర్మిల.. ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా…? తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు..? అని…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. గాయం అయ్యింది.. రెస్ట్‌లో ఉన్నాను అంటూ కేటీర్ ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశాం అన్నారు.. దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని.. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని మండిపడ్డారు.. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి.. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని…
హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు భాగ్యనగరంలో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో.. చరిత్రాత్మక హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అయితే.. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి…
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం పై తీవ్ర ఆరోపణలు చేసారు. మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా.. KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ ఇద్దరు తోడు దొంగలేనా? అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు? అని…