YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ ట్వీట్టర్) వేదికగా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇచ్చిన కూడా.. ఆ తీర్పును వక్రీకరిస్తారా? అని ప్రశ్నించారు. తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందని అసత్య ప్రచారం చేస్తు్నారని ఆయన సీరియస్ అయ్యారు.
Read Also: Pakistan: “ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనండి”.. జైశంకర్‌కి పాకిస్తాన్ నేత ఆహ్వానం..
ఇక, శుక్రవారం ‘ట్విట్టర్’లో టీడీపీ పార్టీ అధికారిక ఖాతాలో చేసిన పోస్ట్ లో తిరుపతి లడ్డూలో జంవుతుల కొవ్వు కలిసిందని చెప్పారని మాజీ సీఎం జగన్ తెలిపారు. తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇక, మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భయం, భక్తి ఉండాలని అన్నారు. ఇంత దారుణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరణ చేయడం దారుణమని చెప్పుకొచ్చారు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbnపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆరోపించారు.
గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbn పై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉంది. pic.twitter.com/RozJAB94aD
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024