లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్ జగన్ ఎత్తిపోత పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. 1,040 లిఫ్ట్ స్కీమ్‌లకు గాను 450 లిఫ్ట్ స్కీమ్‌లు మూతపడ్డాయని ఆరోపించారు.. ఇక, తాళ్లూరు లిఫ్ట్ పైపులు సిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే.. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ కావడం వల్ల బ్రేక్ అవుతోందన్నారు.
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట.. ఓ కేసులో నిర్దోషిగా ప్రకటన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన సన్నిహితులకు ఇస్లామాబాద్ కోర్టులో ఉపశమనం లభించింది. సెక్షన్ 144 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో బుధవారం మాజీ ప్రధాని, అతని సన్నిహితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇమ్నాన్ ఖాన్, షేక్ రషీద్, అసద్ ఖైజర్, సైఫుల్లా నియాజీ, సదాకత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మీరు…
Minister Satya Kumar: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు. శాసన మండలిలో నేను నవ్వుతూ సమాధానం చెప్పానని జగన్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని వైఎస్ జగన్ అడిగారు.
బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. హైడ్రా పేరువింటే చాలు.. తెలంగాణలోని స్థానిక ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఎప్పుడు హైడ్రా అధికారులు వస్తారో.. వారు ఉంటున్న నివాసాలను కూల్చేస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. స్థానికులకు క్లారిటీ ఇచ్చేందుకు ఇవాళ అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటకు వెళ్లారు. రంగనాథ్ ను చూసిన స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. దీంతో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానిక…
YS Jagan: థకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 8 నెలలు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ తో ప్రభుత్వాన్ని నడిపారు.. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు.