YSRCP: నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం
- నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం
- జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో-ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శుల, కార్యదర్శులతో భేటీ
- పార్టీ బలోపేతం, నిర్మాణంపై ప్రధానంగా దృష్టి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: నేడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేయటానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారట వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులపైనా చర్చించనున్నారు.
Read Also: Proba-3 Mission: శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఇక, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శిస్తోంది వైసీపీ.. దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం, మిల్లర్లు – దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న అంశాలపై.. పోరాటాలపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక రాష్ట్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతుందంటున్నారు.. అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ అంశంపై ఇదే సమావేశంలో చర్చించనున్నారు.. పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమేరకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?