మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు.. ఈనెల 11వ తేదీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే జగన్ రాయలసీమ బిడ్డగా ఒప్పుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి లా అండ్ ఆర్డర్ లేదని అనటం ఆశ్చర్యంగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దళిత మంత్రి మీద విమర్శలు చేసి ఊరుకున్నారని.. లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించాల్సింది చంద్రబాబుని అంటూ ఆయన పేర్కొన్నారు.చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్కు లేదన్నారు. దళిత మహిళ కాబట్టి పడుతుంది అని పవన్ ఆమెపై విమర్శలు చేశారన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు.
విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని వైఎస్ జగన్ ప్రకటించారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు.
గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు.