డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కించపరిచేలా సినిమాలు తీశాడని.. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వై.ఎస్.అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా? అని ఆర్జీవీని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమని, కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ… ‘రామ్‌గోపాల్ వర్మ భయపడి పారిపోయాడు. గత ప్రభుత్వం సహకారంతో వర్మ ఇష్టం వచ్చినట్లు వాగాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లను కించపరిచేలా సినిమాలు తీశాడు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ పోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడు. నువ్వు దమ్ముగా ఉంటే.. నిలబడు, నేను చేసింది కరెక్టు అని చెప్పు. నీకు నిజంగా సిగ్గుంటే.. ఆనాడు రెచ్చిపోయి, ఇప్పుడు దాక్కున్న నాని, వంశీ, అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయి. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని వైఎస్ జగన్ అంటున్నాడు. సీఎంగా చేసిన నువ్వు.. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా?. నువ్వు కూడా నీ తల్లి, చెల్లిని బయటకు పంపేశావు. వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు. మరి ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదు. వ్యూహం సినిమా తీసిన నిర్మాతను టీటీడీ బోర్డు సభ్యుడిని చేస్తావా?. చంద్రబాబును కించపరిచేందుకే ఇటువంటి చెత్త సినిమాలను వర్మతో జగనే తీయించాడు. అందుకే ఇప్పుడు వర్మను కాపాడాలని జగన్ మాట్లాడుతున్నాడు’ అని
”జగన్ ఆదేశాలతోనే వారి సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా పోస్టులు పెట్టారు. వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయి. ఇది నిజమని మేము అంటున్నాం.. నీకు దమ్ముంటే నేనే సొంతంగా పోస్టులు పెట్టానని చెప్పు వర్మ, నీకు సవాల్ విసురుతున్నా. మీకు లాగా కేసులకు భయపడి పారిపోయే వ్యక్తులం కాదు మేము. గత ఐదేళ్లుగా మీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని మేము ఎన్నో పోరాటాలు చేశాం. కల్లు తాగిన కోతిలా వర్మ వాగుతున్నాడు.. జగన్ వంత పాడుతున్నాడు. ఇప్పుడు కేసులు పెట్టగానే.. తలో దిక్కు పారిపోయి దాక్కుంటున్నారు. మేము చంద్రబాబు కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉంటాం. మీకు దమ్ముంటే ఇప్పుడు రండి. అధికారంలో ఉన్నప్పుడు వాగిన వారు.. ఇప్పుడు ఎక్కడ?. ఇదే కంటెంట్ తో సినిమా తీసే ధైర్యం వర్మకు ఉందా?. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్‌గా ఉన్న వర్మ.. జగన్ పంచన చేరగానే చీఫ్ డైరెక్టర్‌గా మారాడు. ఎవరైనా చంద్రబాబు జోలికి అన్యాయంగా వస్తే.. వారు నాశనం అవడం ఖాయం’ అని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.