Police Notice to YCP central Office: తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వరుస అగ్నిప్రమాదాలు కలకలం సృష్టించిన విషయం విదితమే కాగా.. అయితే, అగ్నిప్రమాద ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనదారుల పేర్లు, వారి వాహనం నంబర్ల వివరాలు ఇవ్వాలని సూచించారు.. దీంతో, పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను ఇవ్వాలని కోరారు..
Read Also: Mrunal: గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!
కాగా, వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాయి కార్యాలయ వర్గాలు.. ఇదే ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ అందజేయాలని 7వ తేదీన ఓ నోటీసు ఇచ్చారు పోలీసులు.. ఈ క్రమంలో ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయక పోవటంతో సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకు లేఖ ఇచ్చాయి వైసీపీ కార్యాలయ వర్గాలు.. ఈ క్రమంలోనే వైసీపీ కార్యాలయానికి మరో నోటీసు ఇచ్చారు పోలీసులు.. ఇప్పటికే వైసీపీ కార్యాలయ దగ్గర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ స్పందించే అవకాశం ఉంది.. అయితే, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది.. గార్డెన్‌లో పాడైన గ్రీనరికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పి వేశారు.. మళ్లీ అదే రోజు మరోసారి మంటలు చెలరేగడం చర్చగా మారింది.