పీఏసీ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత జగన్.. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి.. ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. దీనివల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం.. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది.. విశాఖలో 3వేల కోట్ల భూమిని ఊరుపేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు.
నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు పీఏసీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 33 మందిని పీఏసీ…
YS Jagan: రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది.
AB Venkateswara Rao: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.
‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం.. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు…
సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్, నేను, ప్రశాంత్ కిషోర్ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..
ఆ మాజీ ఎంపీ హాఫ్ బాయిల్డ్ పాలిటిక్స్ చేస్తున్నారా? తన ఓవరాక్షన్తో మొత్తంగా పార్టీనే ఇరుకున పెట్టేశారా? ఆయన అతి కారణంగా….. ఎఫెన్స్లో ఉండాల్సిన చోట వైసీపీ డిఫెన్స్లోకి పడిపోయిందా? ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన చోట సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయిందా? ఎవరా ఎంపీ? ఎలా ఇరుకున పెట్టారు పార్టీని? ఒక్కసారి ఎంపీ మీదికి మీసం మెలేసి ఓవర్ నైట్లో పాపులర్ అయిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్. ఆ దూకుడు చూసే…. వైసీపీ అధ్యక్షుడు జగన్…