రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ర్పచారం చేశారని, పదే పదే ప్రభుత్వం మీద బురద చల్లే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పులు శుభ్రం చేయటానికే తమకు టైం సరిపోతుందని, విద్యుత్ శాఖను ఆయన దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో…
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి.. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోం.. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు..
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..
వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
తప్పకుండా అధికారంలోకి వస్తాం అని, అందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం (కూటమి ప్రభుత్వం) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాకముందు మన పథకాల ద్వారా పేదల…
మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా…
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలు పార్టీలో చేశారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘ మాజీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్ అని పేర్కొన్నారు. జగన్ లాంటి వ్యక్తిని మరలా సీఎం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తామన్నారు. వైఎస్ జగన్ గారికి సపోర్టుగా ఉండాలని ఉద్యోగ సంఘ…
పాకిస్తాన్‌పై భారత్ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్…
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసిపిలో చేరి కొవ్వూరుకు షిఫ్టయ్యారు. 2019ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోం మంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంత కాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత.... నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీరోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.