మాజీ సీఎం వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దని వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్ వ్యవస్థను నిలిపివేశారని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఫాలో అవ్వాలనుకున్న ఇలాంటి ప్రోగ్రాంను నిలిపి వేయాలనుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి.. రెండున్నర లక్షల మందిని తొలగించి మోసం చేశారని కారుమూరి చెప్పుకొచ్చారు.
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్ వ్యవస్థను నిలిపివేశారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఫాలో అవ్వాలనుకున్న ఇలాంటి ప్రోగ్రాంను నిలిపి వేయాలనుకోవడం దుర్మార్గం. ఎండీయూ వ్యవస్థ ద్వారా దాదాపు 20 వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి రెండున్నర లక్షల మందిని తొలగించి మోసం చేశారు. గతంలో వాలంటీర్లకు రామానాయుడు డ్రామా మాటలు చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసివేయడం ద్వారా ఒక 20 వేల వరకు కుటుంబాలు రోడ్డున పడ్డాయి’ అని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమం.. ప్రజా సమస్యలకు అక్కడే పరిష్కారం!
‘టీడీపీ కార్యకర్త చనిపోతే ఆయన కుమారుడికి ఉద్యోగం ఇవ్వటం మంచిదే. అదే విధంగా పుష్కరాలు సహా మీ పార్టీ కార్యక్రమాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను కూడా ఇలాగే ఆదుకోవాలి. రాష్ట్రంలో భారీగా మద్యం బెల్ట్ షాపులు పెట్టారు. ప్రతీ ఇంటికి మద్యం సరఫరా చేస్తున్నారు కానీ.. రేషన్ పంపిణీ మాత్రం నిలిపివేశారు. వైసీపీ నేతల మీద ఎలాగూ లేని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దు. విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. లోన్లు తీసుకుని వాహనాలు తీసుకున్న ఎండీయూ ఆపరేటర్స్ ఉపాధి కోల్పోతే అప్పులు ఎలా చెల్లించాలి’ అని కారుమూరి ప్రశ్నించారు.