పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు.
BJP Leader Bhanu Prakash Reddy Slams YCP Govt: ఓటమి భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వైసీపీ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.…
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ని ఇంటికి సాగనంపడం కాయమని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. జగన్ బురదను అందరికి అంటించాలని చూస్తున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా చంద్రబాబుని నిర్బంధించారని మండిపడ్డారు. లేని రింగ్ రోడ్డులో అవినీతి ఏంటి అని ప్రశ్నించారు.?
Yatra 2 Movie to Release on 2024 Feb 8th: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాకు మహీవీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్సార్ పాత్రలో మలయాళ ‘సూపర్ స్టార్’ మమ్ముట్టి జీవించారు. ఇక యాత్ర 2లో…