వైసీపీకి గుడ్ బై చెప్పేశారు యార్లగడ్డ వెంకట్రావు.. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. 2019లో సరిపోయిన నా బలం.. ఇప్పుడు సరిపోదా అంటూ నిలదీశారు.
పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విలీన మండలాల ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా మారిందని ఆయన మండిపడ్డారు.
దేశంలోనే మరో విద్యా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలకబోతోంది.. ఈ రోజు జరిగిన వీసీల సమావేశంలో తన విజన్‌ను స్వయంగా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తొలిసారిగా టీచింగ్, లెర్నింగ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌తో అనుసంధానం చేయనున్నారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ, అగ్మాంటెడ్ రియాల్టీ, మషిన్ లెర్నిగ్, ఎల్ఎల్ఎం, మెటావర్స్‌తో మిళితం చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.
చిరంజీవికి.. పవన్ కల్యాణ్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.. నేను రాజకీయాలకు పనికి రాను.. తమ్ముడు పనికొస్తారని గతంలోనే చిరంజీవి అన్నారని గుర్తుచేశారు.. అంటే.. చంద్రబాబు చెప్పినట్టు తాను చేయలేనని.. పవన్ కల్యాణ్ చేయగలడనే విషయం తెలుసు కాబట్టే పవన్ రాజకీయాలకు పని కొస్తాడని చిరంజీవి అన్నారంటూ చెప్పుకొచ్చారు