Gidugu Rudra Raju Slams AP CM YS Jagan: ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగనే అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్, కేంద్రంలో బీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ అని, జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం కాదని గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.
‘ఏపీలో మాకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగన్. ఏపీలో జగన్, కేంద్రంలో బిబీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుంది. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ. జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం కాదు. అధికారుల ట్రాన్సఫర్ లు జరుగుతాయి. ఇప్పుడు పొలిటికల్ ట్రాన్సఫర్ లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అంతా చెడ్డవారా. వైసీపీలో ఉన్న పాత మిత్రులను స్వాగతిస్తున్నా. నిర్బంధ పరిస్థితులలో ఉండే పదవులు అవసరమా? తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Also Read: Shaik Sabjee Dies: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి!
‘డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ప్రతీ కార్యకర్త తమ వాహనాలు, ఇళ్ళ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ పార్టీ సెషన్ ను కాకినాడలో వందేళ్ళ క్రితం నిర్వహించారు. మరలా ఇప్పుడు కాకినాడలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. జనవరి 5 నుంచి 9 వరకూ మండల పార్టీ అధ్యక్షులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. జనవరి 20 నుంచి ఇంటింటా కాంగ్రెస్ అనే ప్రోగ్రామ్ అన్ని నియోజకవర్గాలలో నిర్వహిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశంపై విశాఖకు రాహుల్, అమరావతి అంశంపై అమరావతికి ప్రియాంక గాంధీ, రాయలసీమ అంశలపై ఖర్గే వస్తారు. ఇండియా అలయెన్స్ పార్టీల కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నాం’ అని రుద్రరాజు చెప్పుకొచ్చారు.