కొంతకాలం నుంచి విభేదాల కారణంగా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ రామ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు కూడా! ఇప్పుడు వాటన్నింటిని, తమ ఇగోని పక్కనపెట్టి.. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రాయబారం నడిపి, ఆ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల్ని దూరం చేశారు. రాజమండ్రిలోని ఎంపీ భరత్ రామ్ ఇంట్లోనే ఈ సమస్య పరిష్కారమైంది. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ..…
వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యోదంతం రాష్ట్రంలో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. పథకం ప్రకారమే నిందితులు ఆయన్ను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలినా.. రాజకీయంగా ఇది ఊహించని మలుపులు తిరుగుతోంది. ఓవైపు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే తెరవెనుక ఉండి ఈ హత్య చేయించాడని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ అనుమానంతోనే బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు, గంజి ప్రసాద్ కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కూడా ఎమ్మెల్యేపై దాడికి దిగారు. అయితే, తనపై దాడి చేసింది…
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని…
దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం సాగిన ఈ పోరు, ఎట్టకేలకు ముగిసింది. ఈ పీఠం వైసీపీకే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. న్యాయబద్దంగా ఈ సీటు తమకు దక్కిందని వైసీపీ నేతలు చెప్తోంటే.. అప్రజాస్వామికంగా వైసీపీ ఈ సీటుని కొట్టేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పత్తిపాటు పుల్లారావు అవే…
ఎట్టకేలకు సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ పరిశ్రమ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా కన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు హస్తిన వెళ్లనున్నారు.. ఇవాళ ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించనున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం.. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన.. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్తో పాటు.. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.. మొత్తంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు విశాఖలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు… ఇక, సీఎం వైఎస్…