వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. సౌత్ బైపాస్ వద్ద జగన్‌కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సౌత్ బైపాస్ నుంచి ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డ్‌కు వైసీపీ అధినేత చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నార
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు