Pooja Pal: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నేను హత్యకు గురైతే వారే బాధ్యులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Pal: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించడంతో.. సమాజవాదీ పార్టీ (సపా) నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే పూజా పాల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన హత్య జరిగితే దానికి బాధ్యులు మాత్రం సపా, పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అవుతారని ఆమె స్పష్టంగా ఆరోపించారు. ఈ విషయమై పూజా పాల మాట్లాడుతూ.. నేను అసెంబ్లీలో సీఎం యోగిని ప్రశంసించాను. అహ్మద్‌ను మాఫియా అని పిలిచాను. దాంతోనే నన్ను పార్టీ నుండి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి అహ్మద్ అనుచరులు రెచ్చిపోతున్నారని, నాపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు.
Sreeleela : శ్రీలీల తల్లికి ఎన్టీఆర్ ఇచ్చిన ప్రేరణ.. ఆశ్చర్యపరిచే ఫ్యాక్ట్!
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ఎమ్మెల్యే సోషల్ మీడియాలో.. నా భర్త హత్యకు న్యాయం దొరికింది. కానీ మీరు (అఖిలేశ్ యాదవ్) నన్ను మధ్యలోనే అవమానించి వదిలేశారు. దీంతో సపాలోని క్రిమినల్ మైండ్ ఉన్నవారి ధైర్యం మరింత పెరిగింది. నా భర్తలా నన్ను కూడా హత్య చేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వస్తే నా హత్యకు నిజమైన కారణం సపా, అఖిలేశ్ యాదవ్ అని గుర్తించాలంటూ ఆమె రాసుకొచ్చారు. తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సపా నేతల ఒత్తిడితోనే పార్టీలో చేరినట్టు పూజా పాల చెప్పారు. అయితే, పార్టీ లోపల పరిస్థితి వేరుగా ఉందని, ఇక్కడ ముస్లింలకే మొదటి స్థానం ఉందని.. ఎంత పెద్ద నేరస్తుడైనా ముస్లిం అయితే గౌరవం ఇస్తారన్నారు. కానీ వెనుకబడిన వర్గాలు, దళితులు రెండో స్థానంలో ఉంటారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!