ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సద్దుమణిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ఇంతకుముందు ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. అతన్ని తప్పించబోతున్నారు. అయితే వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించింది అధిష్టానం. కాగా.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరుగనుంది. ఈ…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కేషన్న, పలువురు సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీలు సమావేశం అయ్యారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికే ఈసారి కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తాం.. వేరేవాళ్లకు టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎమ్మిగనూరు ఎంపీపీ కేషన్న.
కర్నూలు జిల్లాలో ఎల్లుండి ( ఈనెల 19వ తేదీన ) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున కార్యక్రమానికి వెళ్తున్నారు.
MLA Chennakesava Reddy: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. దమ్ముంటే లోకేష్ నాపై పోటీచేసి గెలవాలి.. లోకేష్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా దాటేలోపు నా సవాల్‌కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. యువగళం పాదయాత్ర భూ మాఫియా నిధులతో సాగుతోందని నిరూపిస్తా అంటూ మరో చాలెంజ్ విసిరారు.. నా పై, నా…
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మరో సారి కీలక కామెంట్లు చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదని జోస్యం చెప్పారు.. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే టీడీపీ నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు.
వారసుడిని చట్టసభల్లోకి పంపాలని చూస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ విన్నపాన్ని పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇంతలో మరో నాయకుడు అక్కడ కర్చీఫ్ వేసేందుకు పావులు కదుపుతున్నారట. ఈ ఎత్తుగడల మధ్య అధికారపార్టీ రాజకీయాలపై చర్చ స్పీడందుకుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..! ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అక్కడ పార్టీకి గట్టి పునాదులే వేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే…