Chennakesava Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ మొనగాడు.. దానికి సిద్ధం కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ను సూటిగా ఎటాక్ చేసిన ఆయన.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు… బీజేపీ అధికారం లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్ కేశవరెడ్డి..
Read Also: MLA Raja Singh: మరో వీడియో రిలీజ్.. నేను అన్నింటికీ సిద్ధం
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
కాగా, గతంలో గోవ నిషేధ చట్టంపై హాట్ కామెంట్లు చేశారు చెన్నకేశవరెడ్డి.. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని.. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్ధలు మతసామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం లేదన్నారు. హిందువులకు గోవు పూజ్యనీయమైనదని.. కానీ, ముస్లింలకు ఆహార పదార్థం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!