MLA Chennakesava Reddy: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. దమ్ముంటే లోకేష్ నాపై పోటీచేసి గెలవాలి.. లోకేష్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా దాటేలోపు నా సవాల్‌కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. యువగళం పాదయాత్ర భూ మాఫియా నిధులతో సాగుతోందని నిరూపిస్తా అంటూ మరో చాలెంజ్ విసిరారు.. నా పై, నా కుటుంబం పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా.. లోకేష్ సిద్ధామా అని చాలెంజ్ చేశారు.. దేవుడి భూములు కబ్జా చేయలేదు.. లీజుకు తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరికి పట్టినగతే టీడీపీలో చంద్రబాబు, లోకేష్ కు పడుతుందని జోస్యం చెప్పారు..
Read Also: UAE Ambassador Meets CM YS Jagan: ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నాం..!
మరోవైపు ఎప్పటికైనా టీడీపీ నాయకుడు జూనియర్ ఎన్టీఆరే నంటూ మరోసారి చెప్పుకొచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. కాగా, ఎప్పటికైనా టీడీపీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆరే నాయకుడు అవుతాడని ఈ మధ్యే చెన్నకేశవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తర్వాత టీడీపీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. లోకేష్ ఇంకా పది యాత్రలు చేసినా కూడా నాయకుడు కాలేడని అభిప్రాయపడ్డారు. . అయితే అదే సమయంలో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా నాయకుడు అవుతాడంటూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే.