ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఉన్న పెద్దలు అందరూ బయటకు రావాలని, టీడీపీకి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు వెనకడుతుంది? అని ప్రశ్నించారు. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని విమర్శించారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టీడీపీ నేతలు మార్చుకున్నారని, నారావారి పాలన కల్తీ సారా పాలనగా మారిందని వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు.
Also Read: Perni Nani: ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు!
‘దేశంలో అతిపెద్ద కుంభకోణం కల్తీ మద్యం. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలు అందరూ బయటికి రావాలి. టీడీపీకి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు వెనకాడుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలోనే నకిలీ మద్యాన్ని తయారుచేస్తున్నారు. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలు. కల్తీ మద్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని చంద్రబాబు మార్చారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టీడీపీ నేతలు మార్చుకున్నారు. నారావారి పాలన కల్తీ సారా పాలనగా మారింది. కల్తీ మద్యానికి ఎంతోమంది బలయ్యారు. నకిలీ మద్యం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై లేదు. ప్రతి మూడు బాటిల్లో ఒకటి కల్తీ మద్యమే’ అని వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు.