Perni Nani: ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు!
- మేకల సుబ్బన్న అక్రమ అరెస్టుపై పేర్ని నాని ఫైర్
- ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదు
- నిరసన చేపట్టినందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు
- వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సుబ్బన్న అక్రమ అరెస్టుపై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు. మచిలీపట్నంలో ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్ చేశారని, ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
‘ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు అక్రమ కేసులు పెట్టారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందుకు కేసులు పెట్టామంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రమంతా సెక్షన్ 30 అమలు చేయడం వింతగా ఉంది. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వ వ్యతిరేక విధానలపై నిరసన చేపట్టడం మా బాధ్యత. 365 రోజులూ సెక్షన్ 30 పెడితే ప్రజల గొంతు వినిపించకూడదా?. ఛలో మెడికల్ కాలేజీ నిరసన చేపట్టినందుకు 400 మందిపై కేసు పెట్టారు. నోటీసులు ఇచ్చిన వారమంతా స్టేషన్‌కు వెళ్లి మా వివరాలిచ్చాం. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదు. కొల్లు రవీంద్రకు అనుకూలంగా పనిచేస్తే తమను ఏమీ చేయలేరనే భావనలో పోలీసులు ఉన్నారు. మా పట్టణ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే మేం ప్రశ్నించకూడదా?. అరెస్ట్ నోటీసులు ఇవ్వమంటే పోలీసులు ఇవ్వడం లేదు. కోర్టులు ఎన్ని సార్లు చెప్పినా పోలీసులకు చాలా చులకన భావం కనిపిస్తోంది’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
Also Read: IPL 2026 Dates: ఐపీఎల్ 2026కి సంబంధించి క్రేజీ అప్‌డేట్.. డేట్స్ ఫిక్స్!
‘మేం వేసిన రిమాండ్‌ను రిజెక్ట్ చేసే ధైర్యం కోర్టులకు ఉందా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేసి 10 రోజులు లోపలేశాం మర్చిపోయారా అంటున్నారు. మేకల సుబ్బన్న స్టేషన్‌కు వచ్చాడో లేదో సీసీ కెమెరా రికార్డులు తీయండి. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మెప్పు కోసం అధికారులు పనిచేస్తున్నారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులపై పోరాడతాం. ఎంత మందిపై కేసులు పెట్టారో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం మీదేనని రౌడీలను పోలీసులు బ్రతిమిలాడుతున్నారు. మా పార్టీ వాట్సాప్ గ్రూపులను పోలీసులు హ్యాక్ చేశారు. మీ జగన్ మళ్లీ సీఎం అయితే ఏం చేస్తాడని పోలీసులు మాట్లాడుతున్నారు’ అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!