లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు.
వైపీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయలో విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న దూషించిన కేసులో అనిల్‌కు నోటీసులు ఇచ్చారు.
Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది.
CM Chandrababu Warns YS Jagan Over Kovur MLA Controversy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. ఇంతకీ అతను పశువువా, మనిషా అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానైతే మరోసారి అలాంటివి జరగకుండా చూడాలని మందలించేవాడినని, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించాడని సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే…
MLA Vemireddy Prashanthi Reddy Slams YS Jagan: మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ సైంధవుడిలా రాష్టాభివృద్ధిని అడ్డుకుంటుంటే.. అనిల్ కుమార్, ప్రసన్న కుమార్ రెడ్డిలు నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని విమర్శించారు. తల్లిని, చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగం అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ ఓ మంచి బాలుడు, గుణవంతుడు అని ఎద్దేవా చేశారు. జైళ్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని, మహిళా ఎమ్మెల్యేని విమర్శించిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ చాలా సేపు పలకరించారని విమర్శించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎంతో మంది జగన్ వల్ల జైళ్లకి పోతున్నారన్నారు. తమ నేతలు ఎంత మందిపై కేసులు పెట్టారు? అని…
Nara Lokesh Responds on YS Jagan Arrest: సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, మద్యం కుంభకోణం.. పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. మంత్రి లోకేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. చట్టం తన పని…
ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్ధిస్తూన్నారా?…