టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. "లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు, పప్పు లోకేష్ అందుకే అనేది. దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు.
CM YS Jagan Said Nation will be shocked to see the AP Elections Results on June 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్…
Minister Gudivada Amarnath Says YCP Comes to Power in AP: పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే.. ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన…
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో టీడీపీ ప్రలోభాలకు తెర లేపినా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారంటూ మండిపడ్డారు. సుమారు 300 మంది బౌన్సర్లతో టీడీపీ అభ్యర్థి బూత్లలో హల్చల్ చేసినా, రౌడీయిజం చేసినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి…
13వ తేదీ అయిపోయిందని, జూన్ 4వ తేదీ మిగిలే ఉందని వైసీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ వేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడండన్నారు. ఏపీలో తాము అధికారంలోకి రాబోతున్నామని, కడపలో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని, ఓ చెంప మీద కొడితే.. రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు.…
రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య అని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేసిందన్నారు. పోలింగ్ రోజే బీసీ నేత అయిన వెంకటేశ్వర్లను టీడీపీ నేతలు దూషించడం బాధాకరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే.. గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి…
TDP Leaders House Arrest in Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. Also Read: Palnadu: తేరుకుంటున్న పల్నాడు.. తెరుచుకుంటున్న చిరు వ్యాపారాలు! వైసీపీ నేత…
నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్లు నీచ స్థాయికి తీసుకువచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైసీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు చేస్తూ గెలవాలని చూస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్, కడప, విజయవాడల నుంచి దొంగతనాలు,…
అన్ని వర్గాల వారు సీఎం జగన్కు అండగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కాపు సామాజిక వర్గంను మోసం చేశారని.. కాపులను బీసీ చేస్తానని చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏం చేస్తానో చెప్పి.. చేసి చూపించిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. దళితులను జగన్ కు దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్ని నాని మండిపడ్డారు. బీసీలు కూడా చంద్రబాబు తమను వాడుకుని వదిలేశారని ఆగ్రహం…
ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. ఇంటింటి అభివృద్ది చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు.…