రేపు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. రాబోవు అయిదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం తేలనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల అక్రమాలను కమిషన్ పట్టించుకోవడం మానేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఎన్నికల సజావుగా జరగా పోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం... బీజేపీ అడ్డుపెట్టుకొన్న తెలుగుదేశం కారణంగానే ఓటరు హక్కుని హరించారన్నారు.
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై.. గోదావరి జిల్లాల్లో పందెపురాయళ్ళు పందాలకు తెగబడుతున్నారు. ఎన్నికలు అంటేనే పందాలరాయుళ్లకు పెద్ద పండుగ. సర్వేలు ఆధారంగా పందెం రాయుళ్లు వారి ట్రెండ్ ను మారుస్తున్నారు. ఆన్లైన్ వేదికగా పందాలు జోరుగా సాగుతున్నాయి.