అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పలు ప్రాంతాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని, అమరావతికి వచ్చేందుకు బిట్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన యాక్టును మొత్తం పరిశీలన చేసి మార్పులు, చేర్పులు చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ‘అభివృద్ది…
జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గమించారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని, ఫోన్‌ను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలని సూచించారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు.…
సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర నిధులకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. నెల్లూరులో పశు వైద్య కళాశాల, ఎన్ఆర్ఈజీఎస్లో అవినీతికి సంబంధించి సభ్యుల ప్రశ్నించనున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత మాజీ సభ్యుడు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. సభలో ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టిషనర్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమంపై…
పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని.. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్నారు. వేంపల్లి పంచాయితీలో పని చేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారని, జగన్ మోహన్ రెడ్డి సమీప…
24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం అని, అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో కూలగొట్టిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్తో కాశినాయన క్షేత్రంను కూల్చారన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందన్నారు. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నారా లోకేష్ తానే కట్టిస్తా అన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు…
ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే.. అదే విషయాన్ని సుప్రభాతంలా చెబుతున్నా… కొందరు టీడీపీ నాయకుల చెవికెక్కడం లేదా? ప్రత్యేకించి సొంత జిల్లాలో కొందరికి ఆయన మాటంటే లెక్కే లేకుండా పోయిందా? అదే బాధ ఇప్పుడు పార్టీ అభిమానుల మనసుల్ని సైతం మెలిపెడుతోందా? అసలే విషయంలో సీఎం మాటను పట్టించుకోలేదు జిల్లా ప్రడాప్రతినిధులు? వేల కోట్ల రూపాయల అవకతవకల మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వైసీపీ నాయకులకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే….వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్…
ఆ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ ప్రయోగం పూర్తిగా వికటించిందా? అదీ… అలా ఇలా కాకుండా… ఇప్పుడసలు ఏకంగా పార్టీకి నాయకుడే లేకుండా పోయాడా? రండి బాబూ… రండని ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నా, ఖాళీ కుర్చీని చూపిస్తున్నా… అందులో కూర్చునే వాళ్ళు కరవయ్యారా? ఎక్కడ…. అంత సెల్ఫ్‌గోల్ వేసుకుంది వైసీపీ? కులాల ఈక్వేషన్స్ ఎలా దెబ్బతీశాయి? రాజకీయంగా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగిన లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. 2019ఎన్నికల్లో ఈ…
Vijayasai Reddy: వైసీపీకి రాజీనామా చేయటంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉంది.. దాని వల్లే నేను జగన్ కు దూరం అయ్యాను.. ఆయన మనసులో నాకు స్థానం లేదు అని తెలిసింది.. ఆ విషయం తెలిసి నా మనసు విరిగింది.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నాను అని నేను జగన్ కు చెప్పాను.
కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకూ ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నీరుగారుస్తోందని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది తల్లికి వందనంను ఎగ్గొట్టారని, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని మాజీ మంత్రి కాకాణి చెప్పుకొచ్చారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘యువత…