మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో స్కీములు లేవని.. అన్నీ స్కాములు మాత్రమే ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి హంద్రినీవా దాకా అంతా అవినీతే తాండవిస్తోందని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలు రింగ్ అవుతున్నాయి, దీనివల్ల సమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదంటు మండిపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారు. జ్యూడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారు. దీనిని పక్కనపెట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారని వెల్లడించారు.
Also Read:JR NTR : జపాన్ లో దేవర హంగామా.. ఆ సాంగ్ కు ఎన్టీఆర్ డ్యాన్స్..
అమరావతిని ప్రభుత్వం ప్రకటించక ముందే.. ఆ ప్రాంతంలో తనకు సంబంధించిన వారితో భూములు కొనుగోలు చేయించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు లబ్ధి కలగలేదు. రైతుల నుంచి ముందుగానే భూములను కొనుగోలు చేసిన వారు కుబేరులయ్యారు. 2014 ..19 వరకూ జరిగిన వ్యవస్థీకృత అవినీతి పక్రియను మళ్లీ ప్రారంభించారు. వైకుంఠపురం బ్యారేజీ పనుల అంచనాలను పెంచారు. కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. టెండర్ల ప్రక్రియలో ప్రస్తుతం పారదర్శకతలేదు.
Also Read:Jana Nayagan: విజయ్ చివరి సినిమా రిలీజ్ డేట్ ఇదే
వైసిపి ప్రభుత్వ హయాంలో రివర్స్. టెండెరింగ్ ద్వారా వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసాం. నీతి ఆయోగ్ కూడా జగన్ విధానాలను ప్రశంసించింది. అమరావతిలో ఒక కిలోమీటర్ రహదారికి 53 కోట్ల రూపాయలను ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని బట్టి ఎంత ధనం దుర్వినియోగం అవుతుందో అర్థం అవుతుంది. తనకు అనుకూలమైన వారికే కాంట్రాక్టులు అప్పగించారని కాకాని తెలిపారు.