YS Jagan: ఈరోజు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా జగన్ విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు కాసేపు ముచ్చటించి.. దాదాపు గంటన్నరకు పైగా గడిపారు.
Read Also: Eatala Rajendar: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం వ్యాఖ్యలపై స్పందించిన ఈటల..!
ఇక, వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమలారెడ్డితో పాటు పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా,అంతకు ముందు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలా సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025