Sajjala Ramakrishna Reddy: వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్యనేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఇక, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.
Read Also: Vijay Mallya Tweet On RCB: ఆర్‌సీబీని ప్రశంసిస్తూ విజయ్ మాల్యా ట్వీట్.. నెటిజన్స్ ట్రోలింగ్
అయితే, రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని సజ్జల తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం అయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం అన్నారు.