కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు ఎన్ని కుప్పి గంతులు వేసినా ప్రజలు నమ్మరని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే అన్యాయంగా ఉంటుందన్నారు. రైతులను రాజులుగా చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం మాదని మంత్రి అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించి ఆత్మ స్థైర్యం కల్పించిన ప్రభుత్వం…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్దిరెడ్డి కూడా సీఎం కావాలని కోరుకున్నాడని కిషోర్‌కుమార్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అందరూ సీఎంలతో గొడవలు, అసమ్మతి ఆయనకు మాములేనంటూ…
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వైసీపీ అని చెప్పారు. రైతుల కోసం అనేక ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు.ఎరువులకు ఇబ్బంది లేకుండా మిగులు నిల్వలతో రైతుల కోసం ఆలోచిస్తున్న…
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ఉ ఓటేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ప్రజలకు జగన్ చరిత్ర తెలిసి మరీ ఓటేశారని ఫైర్ అయ్యారు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేయడమంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటీ.. ? అంటూ సీరియస్ అయ్యారు. చంద్రబాబుకంటే ఎక్కువగా ఏదో మంచి చేస్తారని ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలన్నీ చేసేస్తాడేమో.. మనం ఏమైపోతాం అని.. రాజకీయంగా ఉండగలమా..? లేదా..? అని నేనూ భయపడ్డానని వెల్లడించారు.…
రాష్ట్రంలో దశ దిశ లేని జగన్‌రెడ్డి పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని కడతామని చంద్రబాబు ఓడిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ పారిపోయాడు.. 2024లో బీజేపీకి అధికారాన్ని ఇస్తే రూ.10వేల కోట్లతో మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు ఇచ్చినా ప్రధాని మోడీ ఏపీకి రూ.50 వేల కోట్లను ఇచ్చారని చెప్పారు. Read Also:…
పేదల ఇళ్ల స్థలాలు.. ఇళ్ల నిర్మాణంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు.ఇళ్ల స్థలాల కొనుగోళ్ల విషయంలో ఓ ఎంపీని…
ఎప్పుడు ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ సారి ఏపీ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ నేతలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందుతుంటే అది బీజేపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వం పై ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆయన బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. Read Also: మహిళలను హింసించడం…
పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఏడాదికి రూ.18,000వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కేవలం 31లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందేవని, కేవలం జన్మభూమి కమిటీలు సూచించిన వారికి మాత్రమే ఇచ్చేవారని మంత్రి విమర్శించారు. Read Also: నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల నుంచి…
రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యత ఈ ఏడాది నుంచి మరింతగా పెరుగుతుందన్నారు. వైసీపీ పాలనకు 30 నెలలు పూర్తియిందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ వందకు వందశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. క్యాలెండర్ డేట్స్‌తో సహా అన్ని పథకాలను చెప్పినవాటి చెప్పినట్టుగా పూర్తి చేశామన్నారు. Read Also:ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సజ్జనార్…
జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదని..రాబోయేది జగన్ కు ఒడిదుడుకుల సమయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. జగనే కాకుండా ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదని పేర్కొన్నారు. ఎప్పుడూ వినని వందల రకాల మద్యం బ్రాండ్స్ వున్నాయని… అడిగే వాడే లేడని పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. మద్యం ప్రియులను దోచేస్తూ వారి నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుపుతున్నారు..కొన్న దానికన్నా పది రెట్లు ఎక్కువ చేసి మద్యాన్ని అమ్ముతున్నారని ఆగ్రహం…