ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
- ఇస్రో ప్రైవేటీకరణ జరగదని చైర్మన్ వి. నారాయణన్ స్పష్టీకరణ.
- ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరగడం ఇస్రోను బలహీనపరచడం కాదు.
- ఇస్రో ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరిస్తామని హామీ.
- దాదాపు 450 పరిశ్రమలు ఇప్పటికే ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రైవేటీకరణ కాదని సంస్థ చైర్మన్ డాక్టర్ వి. నారయణన్ స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇస్రో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇస్రో చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తాము ఇస్రో ఉద్యోగుల్లో ఆందోళనల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూర్ స్పేస్ ఎక్స్‌పోలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతరిక్ష రంగ సంస్కరణలు ఆరేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని, ప్రైవేట్ రంగానికి మార్గనిర్దేశం చేయడం, భారత అంతరిక్ష వ్యవస్థను మరింత విస్తరించడం సంస్కరణల లక్ష్యమని ఆయన వివరించారు. స్పేస్ ఇండస్ట్రీలో ప్రైవేట్ పరిశ్రమ కొత్తది కాదని, రాకెట్ల తయారీలో ఇప్పటికే వందలాది భారతీయ కంపెనీలతో కలిసి ఇస్రో పనిచేస్తుందని తెలిపారు. PSLV లేదా GSLV ప్రయోగం జరుగుతున్నప్పుడు మొత్తం పని ఇస్రోనే చేస్తుందని అనుకోవద్దని, సుమారు 80 శాతం బడ్జెట్ పెట్టుబడులు భారత పరిశ్రమల నుంచే వస్తున్నాయని, దాదాపు 450 పరిశ్రమలు మాతో కలిసి పనిచేస్తున్నారని నారాయణన్ చెప్పారు.
Also Read
- India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
- Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
భారతదేశానికి ఏడాదికి సుమారు 50 లాంచ్ వెహికల్స్ అవసరం ఉంటుందని, ఇంత పెద్ద స్థాయిలో రాకెట్ల అవసరాలను తీర్చాలంటే ఇస్రోతో పాటు భారీ పారిశ్రామిక వ్యవస్థ కూడా అవసరమని ఇస్రో చీఫ్ వెల్లడించారు. ఇస్రోలో 20 వేల మంది ఉద్యోగులం ఉన్నామని, వారి ఆందోళనల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం అంటే, ఇస్రో పాత్ర తగ్గించడం కాదని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!