Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
- అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం..
- డీఎంకేపై విరుచుకుపడిన టీవీకే అధినేత..
- స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay DMK Attack: తమిళనాడు సీఎం విజయ్, అసెంబ్లీలో డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతి చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రతిపక్ష డీఎంకేతో పాటు మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ల నుంచి ‘పార్టీ ఫండ్’ పేరుతో కాంట్రాక్ట్ మొత్తంలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు లంచంగా వసూలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పత్రాలను ఉటంకిస్తూ ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, రుణాలకు EMIలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు.
ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలోని ప్రభుత్వ పనుల కాంట్రాక్టర్ల నుంచి పార్టీ ఫండ్ పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. తాను చేస్తున్నవి వ్యక్తిగత ఆరోపణలు కాదని స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లు అనుమానిత ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఈడీ పేర్కొన్న విషయాన్ని విజయ్ సభలో ఆరోపించారు.
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
టాస్మాక్ (TASMAC) వ్యవహారంలో ఈడీ ప్రస్తావించిన ‘‘కరూర్ గ్యాంగ్’’ అంశాన్ని కూడా విజయ్ లేవనెత్తారు. మాజీ ఎక్సైజ్ మంత్రి వి. సెంథిల్ బాలాజీ, ఆయన అనుచరులు కరూర్, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లోని బార్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఈడీ పత్రాలను ఉటంకిస్తూ విజయ్ ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు ఒక వ్యవస్థీకృత విధానంలో జరిగిందని, ఇది సైంటిఫిక్ కరప్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దశాబ్ధాల నాటి సర్కారియ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన టెండర్లో 2.5 శాతం పార్టీ ఫండ్ డిమాండ్ చేశారన్న ఆరోపణల్ని సీఎం విజయ్ ప్రస్తావించారు. విజయ్ ఆరోపణల నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. విజయ్ అసలు సమస్యలపై సమాధానం ఇవ్వకుండా డైవర్షన్ కోసం పాత కేసులు, ఆరోపణల్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!