కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలని హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నింటిని విడిచి పెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం బీజేపీ కార్యకర్తలు 5 రేషన్ షాపులకు తాళాలు వేశారు. మరికొన్ని చోట్ల రేషన్ షాపులు తమకే అని లాగేసుకున్నారు.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?
కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ… ‘నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే, నేను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలి. లబ్ధి చేకూర్చే అన్నింటినీ విడిచి పెట్టాలి. లేకపోతే లెక్క వేరేగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఐదేళ్లుగా చేసుకున్నది చాలు, ఇక మా కార్యకర్తలకు అప్పగించండి. అధికారుల నుండి ఎలాంటి లేఖలు తెచ్చుకోం, నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అందరూ శాంతియుతంగా ఉండాలి.. రౌడీయిజం, గుండాయిజం నాకు నచ్చదు’ అని అన్నారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయి.. రేషన్ షాపులకు తాళాలు వేశారు.