ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఒకటి, రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
Jagananna Mana Bhavishyathu: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.. ఇక, ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. దీనిపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో సంతోషిస్తున్న వైసీపీ పార్టీ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ షెడ్యూల్‌ను…
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించబోతున్నారు.. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకాబోతున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై చర్చ సాగుతోన్న సమయంలో.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా…
YSRCP Issues Whip to MLAs: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో.. అప్రమత్తమైన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని..…
పల్నాడు రాజకీయాలు మళ్లీ హీటుపెంచుతున్నాయి.. అయితే, పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారని విమర్శించారు.. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డిలని పల్నాడు నుంచి ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం…
అధికారం మనదే.. అడిగేవారే లేరు.. అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? నిఘావర్గాల నివేదికలతో ఆ ఎమ్మెల్యేల జాతకాలు మారబోతున్నాయా? అన్నీ చూస్తున్న హైకమాండ్… వారిని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? జగన్ గాలిలో అనామకులు సైతం ఎమ్మెల్యేలుగా గెలుపు..! 2014లో ఓడిన వైసీపీ 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయబావుటా ఎగుర వేసింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఇతర…
గుంటూరు జిల్లా వైసీపీలో సెల్ఫ్‌గోల్…! స్ట్రాటజీ లోపించిందో ఏమో.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టేశారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. స్వపక్షంలో విపక్షంగా మారి చర్చల్లోకి వచ్చారు. మంత్రి, ఎమ్మెల్యేలు మీటింగ్‌కు వచ్చినా.. కలెక్టర్, JCలు రాకపోవడం అనుమానాలకు కారణమై.. కొత్త చర్చకు దారితీసింది. ఎందుకిలా? వాళ్ల పరువు వాళ్లే తీసేసుకుంటున్నారా? గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలుంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది 15. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో మద్దాలి గిరి.. వైసీపీకి జై కొట్టేశారు. దాంతో అధికారపార్టీ…