ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…
కేబినెట్‌లో చోటుకోసం ఎదురు చూస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలను రెండున్నరేళ్ల గడువు ఊరిస్తోంది. జిల్లాల నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. రేస్‌లో వెనకబడకుండా.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శాసనసభ్యులు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అలాంటి వారిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా నుంచి కేబినెట్‌లో చోటుదక్కేది ఎవరికి? రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏర్పాటుకాగానే.. మొదటి జాబితాలోనే మంత్రి కావాలని ఆశించినవారు అనేక మంది. సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు సీరియస్‌గానే ప్రయత్నించారు.…