YSRCP Issues Whip to MLAs: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో.. అప్రమత్తమైన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేశారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు… అయితే విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. దీంతో.. ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నట్టు అయ్యింది..
Read Also: Vishnuvardhan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. ఇలా స్పందించిన విష్ణువర్ధన్‌రెడ్డి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున పంచుమర్తి అనురాధ బరిలోకి దిగారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ కూడా విప్‌లు జారీ చేయడంతో.. పార్టీ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఎవరు ఎవరికి ఓట్లు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.