Jagananna Mana Bhavishyathu: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.. ఇక, ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. దీనిపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో సంతోషిస్తున్న వైసీపీ పార్టీ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ షెడ్యూల్‌ను మరో 9 రోజుల పాటు పొడిగిస్తూ మూడు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది.. దీంతో, జగనన్నే మా భవిష్యత్ హుషారుగా సాగుతోంది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, కన్వీనర్లు, గృహసారథులు కలిసి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారు..
Read Also: Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి..? ఏమిటా కథ..
వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జగనన్నే మా భవిష్యత్, నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమానికి మంచి స్పందన ఉండగా.. కొందరు ఎమ్మెల్యేలో ఈ కార్యక్రమంలో విశేష కృషి చేస్తున్నారు.. మెగా పీపుల్స్ సర్వే కి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో.. ఇప్పటికే మెగా సర్వేలో కోటికి పైగా కుటుంబాలను కలిశారు.. అందులో జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 75 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ రావడంతో.. వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, మిస్డ్ కాల్స్ లో మొదటి స్థానంలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఉండగా.. రెండో స్థానంలో మంత్రి విశ్వరూప్, అమలాపురం నియోజకవర్గం ఉంది.. మూడో స్థానంలో ఎమ్మెల్యే కాటసాని రాం రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం ఉండగా.. నాలుగో స్థానంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జమ్మల మడుగు నియోజకవర్గం ఉంది.. ఇక, ఐదో స్థానంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు కైకలూరు నియోజకవర్గం ఉన్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.