గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు.
కాపులకు తానెప్పుడూ అండగా నిలిచానన్నారు. మరోసారి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే.. నియోజకర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పుకొచ్చారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీర కుమారి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
భారీగా తరలి వచ్చిన అశేష జనవాహనితో పెదకూరపాడు జనసంద్రంగా మారింది. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు.
సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మమల్ని గెలిపిస్తాయని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు. ఇక, మార్కాపురం నియోజకవర్గ ప్రజలు వివేకవంతులు.. వారు వైసీపీకి అండగా ఉంటారని చెప్పారు.