సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మమల్ని గెలిపిస్తాయని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు. ఇక, మార్కాపురం నియోజకవర్గ ప్రజలు వివేకవంతులు.. వారు వైసీపీకి అండగా ఉంటారని చెప్పారు. నేను ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. డబ్బు కోసం కాదు అన్నారు. బ్లాక్ మెయిల్ చేయడంలో కందుల నారాయణరెడ్డి సిద్ధహస్తుడు అంటూ ఆరోపించారు. గెలిపించకపోతే ఊరి వేసుకుని చనిపోతా అని చెప్పడం ఆయనకు కొత్త కాదు అని చెప్పుకొచ్చారు. నేను గిద్దలూరులో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అన్ని సామాజిక వర్గాలకి నేను కావాల్సిన వాడిని అంటూ మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Nestle: నాణ్యతపై రాజీ పడలేదు, 5 ఏళ్లలో 30 శాతం చక్కెర తగ్గించాం.. ఆరోపణపై నెస్లే స్పందన..
ఇక, మా నేత జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు చెప్పుకొచ్చారు. నా సిద్ధాంతం ప్రజలకు మేలు చేయడమే.. అభివృద్ది అనేది ఒక రోజులో జరిగేది కాదన్నారు. అలాగే, వాలంటరీ వ్యవస్థ మీద విపక్షాలు రాజకీయాం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక, ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. నేను స్వాగతిస్తున్నాను అన్నారు. మార్కాపురంలో అన్ని కులాల దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుంది.. పార్టీలకు అతీతంగా అందరికి జగన్ సంక్షేమ పథకాలను అందించారు అని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు వెల్లడించారు.