Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ తరువాత యష్ కొత్త చిత్రాన్ని ప్రకటించడానికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్యనే టాక్సిక్ అనే సినిమాతో వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనుంది. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టాక్సిక్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.