Yash: యష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆరోజు కలవడం కష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ తరువాత యష్ కొత్త చిత్రాన్ని ప్రకటించడానికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్యనే టాక్సిక్ అనే సినిమాతో వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనుంది. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టాక్సిక్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. యశ్ హీరోగా నటిస్తోన్న 19వ సినిమా ఇది. దీనిపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక జనవరి 8 న యష్ పుట్టినరోజు. దీంతో ఆరోజు టాక్సిక్ అప్డేట్ వస్తుందని కొందరు ఎదురుచూస్తుండగా.. చాలామంది ఆరోజు.. యష్ ను స్వయంగా కలిసి విష్ చేయాలనీ ఆశలు పెట్టుకున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు వస్తే.. ఆ హీరో ఇంటిదగ్గర అభిమానులు పడిగాపులు కాస్తూ విష్ చేయడానికి సిద్ధంగా ఉంటారని తెల్సిందే. అయితే ఈసారి యష్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తన పుట్టినరోజుకు తాను ఇంటిదగ్గర ఉండడం లేదని తెలిపాడు.
“మేము టాక్సిక్.. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అని ప్రకటించి దాదాపు ఒక నెల అయ్యింది. నా సినిమాపై మీరు కురిపించిన ప్రేమ మరియు ప్రశంసలు నాకు ప్రపంచాన్ని సూచిస్తాయి. మీ ఉత్సాహం, రియాక్షన్స్, సిద్ధాంతాలు మరియు విశ్లేషణలు నన్ను మరింత చేయమని ప్రోత్సహిస్తున్నాయి. మీలో చాలా మంది నా పుట్టినరోజున నన్ను వ్యక్తిగతంగా కలవడానికి, సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీతో కలిసి ఉండాలని నేను కూడా ఉండాలని ఉంది. మీతో ఉండగలగడం అనేది నేను చాలా విలువైన వాటిలో ఒకటి. కానీ, నేను జనవరి 8న దూరంగా ఉంటాను కాబట్టి మనం కొంచెం వేచి ఉండాల్సి రావచ్చు. నన్ను నమ్మండి.. వ్యక్తిగతంగా నేను లేకపోయినా, మీ నుంచి వచ్చే ప్రతి విష్ ఎంతో స్పెషల్ గా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక యష్ లేకపోయినా ఆయన బర్త్ డేను గ్రాండ్ గా చేయాలనీ అభిమానులు ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి టాక్సిక్ తో యష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Also Read
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
— Yash (@TheNameIsYash) January 4, 2024
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!