తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి క్షేతానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది.. దీంతో, మొదట్లో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. ఈ మధ్యే వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. కొండపైకి వాహనాలకు అనుమతి ఇచ్చారు.. అంతే కాదు, కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు.. ఇక, నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.. అధికంగా ఉన్న పార్కింగ్ ఫీజుతో పాటు.. అదనపు రుసుముపై తీవ్ర…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా జరుగుతున్న ఉద్ఘాటన పర్వాలులో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ…
మనదేశంలో గవర్నర్ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎప్పటినుంచో వుంటోంది. రాజ్యాంగ బద్ధమయిన పదవిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ప్రభుత్వాలను సరిగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఏనాటినుంచో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోందంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మళ్ళీ ఈ అంశం తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో గవర్నర్ వ్యవహరించిన…
దక్షిణకాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్నఆలయం అభివృద్ధిదిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన వేములవాడ రాజన్న ఆలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దిన అనంతరం అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు.. తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో మరికొన్ని దేవాలయాల అభివృద్ధిపై దృష్టిసారించారు సియం కేసీఆర్.. అందులో భాగంగా వేములవాడలో కొలువున్న శ్రీరాజరాజేశ్వరస్వామి…
యాదాద్రిలో పునర్ నిర్మించిన శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి… క్రమంగా భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది… యాదాద్రిలో పునర్ నిర్మితమైన అద్భుతమైన ఆలయాన్ని చూసి పరవశించిపోతున్నారు భక్తులు.. ఇప్పటికే ఆలయంలోనిర్వహించే వివిధ రకాల పూజలు, దర్శనాలకు సమయాలను ప్రకటించిన అధికారులు.. మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్రమంగా అన్ని సదుపాయాలను కల్పించే పనిలో పడిపోయారు.. అందులో భాగంగా.. రేపటి నుంచి యాదాద్రి కొండపైకి ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించనున్నారు.. లక్ష్మీ…
వినూత్నంగా రూపుదిద్దుకున్న తెలంగాణ తిరుపతి యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రికి వెళ్ళే భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండ పైకి యాదాద్రిదర్శిని పేరుతో బస్సులు ఏర్పాటుచేశారు. ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు సెస్ చార్జీలు మాత్రమే పెంచాం.…
భక్తుల పాలిట కల్పతరువు యాదాద్రి. బహుసుందరంగా రూపుదిద్దుకుంది. యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. నాలుగవ రోజు ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఏ విషయం గురించైనా కేసీఆర్ మాట్లాడగలరు. అది కూడా అనర్ఘళంగా.. గంటల సేపు అందరినీ టీవీల ముందు కట్టిపడేసి తన వాయిస్, తన ఛాయిస్ వినిపించగలరు. ఈమధ్యకాలంలో చినజీయర్ తో కేసీఆర్ కు గ్యాప్ బాగా వచ్చిందనే ప్రచారం సాగుతోంది. అయితే సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ స్పందించారు. చినజీయర్‌తో తనకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చేశారు.…