వినూత్నంగా రూపుదిద్దుకున్న తెలంగాణ తిరుపతి యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రికి వెళ్ళే భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండ పైకి యాదాద్రిదర్శిని పేరుతో బస్సులు ఏర్పాటుచేశారు.
ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు సెస్ చార్జీలు మాత్రమే పెంచాం. టోల్ ప్లాజా డబ్బులు టిఎస్ ఆర్టీసీ చెల్లిస్తుంది. ఏటా 70 నుండి 100 కోట్లు ఆర్టీసీ నష్టపోతోంది. ఆర్టీసీ లాభాల కోసమే చార్జీల పెంపు. ఇంత చేసిన రోజు 6 కోట్ల రూపాయల నష్టపోతున్నాం. త్వరలోనే కొత్త బస్సులు ఏర్పాటు చేస్తాం అన్నారు.
యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ప్రతి జిల్లా జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుండి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. జెబిఎస్ నుండి 100 రూపాయలు. ఉప్పల్ నుండి 75 రూపాయలు. ప్రతి రోజు 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇతర జిల్లాల నుండి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్ వాహనాలకంటే ఆర్టీసీ బస్సుల్లోనే సుఖవంత ప్రయాణము వుంటుందన్నారు. వీఆర్ఎస్ ఉద్యోగులు కొంత మంది కోరుకుంటున్నారు. బలవంతంగా మేము వీఆర్ఎస్ ఇవ్వటం లేదన్నారు సజ్జనార్. ఆర్టీసీలో రెండువేలమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే వారు వీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు. ఇంకా ఎంత మంది వస్తారో చూసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం అని వివరించారు ఎండీ సజ్జనార్.