దక్షిణకాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్నఆలయం అభివృద్ధిదిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన వేములవాడ రాజన్న ఆలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దిన అనంతరం అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు..
తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో మరికొన్ని దేవాలయాల అభివృద్ధిపై దృష్టిసారించారు సియం కేసీఆర్.. అందులో భాగంగా వేములవాడలో కొలువున్న శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాల అభివృద్ధికై కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు అధికారులు. వేములవాడ కొండగట్టు ఆలయాల మాస్టర్ ప్లాన్ కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశము జరగ్గా ప్రముఖ ఆర్కిటెక్ట్ నంద సాయి ఆధ్వర్యంలో రెండు దేవాలయాల పర్యవేక్షణ అనంతరం మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.
వేములవాడ ఆలయాన్ని కాకతీయ చాళుక్యుల కట్టడాల్లా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతంఉన్న ఆలయాలను చెక్కుచెదరకుండా దానిపక్కనే మరికొన్నినిర్మాణాలు చేసే దిశగా ఫ్లాన్ రెడీచేస్తున్నారు. 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ రెడీ చేసి సీఎం కేసీఆర్ కు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆతర్వాత సీఎం కేసీఆర్ వేములవాడ కొండగట్టులలో పర్యటించిన అనంతరం దేవాలయాల అభివృద్ధిపై తుది ప్లాన్ వర్కవుట్ చేయనున్నట్లు సమాచారం.
https://ntvtelugu.com/tirumala-mettu-route-damaged/
వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు అయిన విటీడీఏ ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధిపనులు చకచకా జరిపేందుకు అధికారులు ప్రణాళికలు తయారుచేస్తున్నారు.దేవాలయాల మాస్టర్ ప్లాన్ కి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వెంటనే పనులు ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గతఎన్నికల హామీల్లో భాగంగా సియం కేసీఆర్ వేములవాడ కొండగట్టు ఆలయాల అభివృద్ధిపై దృష్టిపెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.